![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -102 లో.. సీతాకాంత్ అభిచే రామలక్ష్మికి ఫోన్ చేయించి తను చెప్పినట్టు మాట్లాడమని చెప్తాడు. రామలక్ష్మి నీతో కలిసి మాట్లాడాలని అభి చెప్పగానే.. రామలక్ష్మి సరే అంటుంది. ఆ తర్వాత అభికి ఏం మాట్లాడాలో సీతాకాంత్ చెప్తాడు.. నేను చెప్పినట్టు చేయకుంటే నేను ఏం చేస్తానో తెలుసు కదా అంటూ అభికి సీతాకాంత్ వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు. సీతాకాంత్ ని ఆగమని శ్రీలత మాట్లాడుతుంది. మీరు ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నారంట ఎందుకని అడుగుతుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఈ రెండు నెలల్లో రామలక్ష్మి నెల తప్పాలని శ్రీలత ఇద్దరికి చెప్తుంది. మీకే ఫోన్ చేస్తున్నా మీరే వచ్చారు.. అభి మాట్లాడాలి రమ్మని చెప్పాడని రామలక్ష్మి చెప్తుంది. అవునా సరే వెళ్ళు అని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్తాడు. అదంతా విన్న శ్రీవల్లి రామలక్ష్మి ఎవరినో కలవడానికి వెళ్తుందని తనని ఫాలో అవుతుంది. ఆ తర్వాత అభి, రామలక్ష్మి ఇద్దరు ఒక దగ్గర కలుసుకుంటారు. నీ ఫోన్ కలవకపోతే నేనెంత టెన్షన్ పడ్డానోనని రామలక్ష్మి అనగానే.. ఫోన్ కలవకపోతేనే అలా అయితే నేను నీకు దూరంగా వెళ్ళిపోతే ఏం చేస్తావ్ అని అభి అంటాడు. ఎం మాట్లాడుతున్నావ్ అభి అని రామలక్ష్మి అంటుంది. నిజమే నేను కోట్లలో బిజినెస్ స్టార్ట్ చేశాను.. ఇప్పుడు నా కోసం కోటీశ్వరులు వెంటపడుతున్నారు.. నీ లాంటి పూర్ పర్సన్ నాకు వద్దని అభి అంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నువ్వు ఇలా అనలేదని రామలక్ష్మి కోప్పడుతుంది. అప్పుడు నీ అందం కన్పిస్తుంది.. ఇప్పుడు కోట్లు కన్పిస్తున్నాయని అభి అంటాడు.
నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసిందని రామలక్ష్మి అంటుంది. నువ్వు నాకు అక్కర్లేదంటూ ఏడుస్తూ రామలక్ష్మి వెళ్ళిపోతుంది. అదంతా శ్రీవల్లి చూస్తుంది. ఆ తర్వాత అభి దగ్గరికి సీతాకాంత్ వచ్చి మాట్లాడతాడు. రామలక్ష్మి ఏడుస్తూ గుడికి వెళ్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతుంటే సీతాకాంత్ వెళ్లి.. ఏమైందని అడుగుతాడు. అభి అన్న మాటలు చెప్తుంది. అలా ఎందుకు మాట్లాడాడో నేను అడుగుతానని సీతాకాంత్ అంటాడు. అవసరం లేదు సర్ అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |